🏠 www.instanews.co.in
Watermark
Clip Header Logo
Date of Publish : 29 September 2026, 1:35 pm Posted by : INSTA NEWS

పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త

News Image
పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త: వరుసగా 3వ రోజు కుప్పకూలిన బంగారం ధరలు


గత కొన్ని రోజులుగా ఊగిసలాడుతున్న పసిడి ధరలు వరుసగా మూడవ రోజు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు గణనీయంగా పడిపోయాయి.
నేటి మార్కెట్ ధరల వివరాలు:
• 22 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల ధరపై రూ. 1250 తగ్గి ప్రసుతం రూ. 1,38,400 వద్ద ట్రేడ్ అవుతోంది.
• 24 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1370 తగ్గి రూ. 1,48,800 కు చేరుకుంది.
• వెండి ధర: కిలో వెండి ధర కూడా తగ్గి ప్రస్తుతం రూ. 2,50,000 వద్ద కొనసాగుతోంది.
త్వరలో వివాహాల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ధరల తగ్గుదల వినియోగదారులకు పెద్ద ఉపశమనం కలిగించనుంది.
🏠 Home